రూ.77 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

  • ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరారీలో ముగ్గురు

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : అక్రమంగా నిల్వ చేసిన రూ. 77.60 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలం తెలిపిన వివరాల ప్రకారం... గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారన్న సమాచారంతో శనివారం అర్థరాత్రి స్థానిక ఓంకార్ జిన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నాలుగు గోడౌన్లు, చాందా వద్ద గల ఓ గోడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసులు తనిఖీలు చేశారు.

ఓంకార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిన్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లులోని నాలుగు గోడౌన్లలో రూ. 50,16,942, చాందా వద్ద గల గోడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.27,43,644 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు దొరికాయి. విచారణ జరిగిన పోలీసులు పట్టణానికి చెందిన సాజిదుల్లా ఖాన్, ఫసివుల్లా ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా, అస్లాం ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సమీఉల్లా ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అజ్మతుల్లా ఖాన్, అర్బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీలు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. దాడుల్లో ఎస్పీతో పాటు డీఎస్పీ ఎల్.జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఐలు కె.సత్యనారాయణ, ఎ.అశోక్, ఎ.రమాకాంత్ పాల్గొన్నారు.