
‘‘ బిర్యానీ అంటే ఓల్డ్ సిటీలో తినాలి మామా.. అక్కడ వేసే మసాలా, స్పైసెస్, టేస్ట్.. వేరే లెవల్..’’ అనే వాళ్లు చాలా మంది ఉంటుంటారు. ఎందుకంటే బిర్యానీ అంటే అంత స్పెషల్ అక్కడ. కానీ ఇది తెలిస్తే ఇలాంటి బిర్యానీ ఎలా తిన్నామో అనిపిస్తుంది ఎవరికైనా. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ హోటల్ చేసిన నిర్వాకం తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.
పాతబస్తీలో హోటల్స్ పై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో టన్నుల కొద్దీ కుళ్లిన మటన్ చూసి అధికారులు షాకయ్యారు. ఏకకాలంలో సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ దాడులు చేసి 4 నెలలుగా ఫ్రిజ్‌ల్లో కుళ్లిన మాంసం నిల్వలు గుర్తించారు.
ALSO READ | Summer Fruits : కర్బూజతో మిల్క్ షేక్, రసగుల్లా, కస్టర్డ్.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి..
ఉత్తరాది రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కుళ్లిన మాంసం తీసుకొచ్చి ఫ్రిజ్ లో నిల్వఉంచి రోజూ వినియోగిస్తున్నారు. బిర్యానీ, ఫ్రై లలో వాడుతూ కస్టమర్స్ కు ఎంచక్కా సర్వ్ చేస్తున్నారు. నాలుగు నెలలుగా కుళ్లిన మాంసం దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్నట్లు గుర్తించారు.
మంగళ్‌హాట్‌లో 12 క్వింటాళ్ల మాంసం, డబీర్‌పురాలో 2 క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కుళ్లిన మాసాన్ని వినియోగిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.