
కుత్బుల్లాపూర్లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని దూలపల్లి X రోడ్ లో పోలీసు తనిఖీల్లో భాగంగా కారును చెక్ చేయగా గంజాయి సంచులు బయటపడ్డాయి. సుచిత్ర నుంచి మహారాష్ట్ర కు హుండై కారులో రేర్ బంపర్, సీటు మధ్యలో గంజాయి బ్యాగులు ఉంచి గంజాయి రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి గుట్టును బయటపెట్టారు. గంజాయి తరలిస్తున్న నిందితులు అమర్ నాథ్, సంజీవ్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు.