మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ప్రభావం అప్పుడే కనపడుతోంది. నల్లగొండ జిల్లాలో భారీగా బంగారం పట్టుకున్నారు పోలీసులు. మిర్యాలగూడ పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బంగారం పట్టు బడింది. బొలేరో వాహనంలో తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడకు TS 09 UE 2479 బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు బంగారం తరలిస్తున్నారు. ఈ బంగారానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. వాహనంతోపాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారు విలువ రూ. 5కోట్లు 73 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.