సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న రూ.48 లక్షల విలువైన192 కిలోల గంజాయిని ఇక్రిశాట్ టోల్ గేట్ వద్ద సీజ్ చేశారు. తూర్పుగోదావరి నుండి మహారాష్ట్ర వైపునకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశారుSOT పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.