అక్రమంగా తరలిస్తున్న ‘రేషన్’ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న ‘రేషన్’ పట్టివేత

అన్నపురెడ్డిపల్లి, వెలుగు :  అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని అన్నపురెడ్డిపల్లి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామ సమీపంలోని సీతారామ కెనాల్ బ్రిడ్జి దగ్గర ఎస్సై చంద్రశేఖర్  సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

ట్రాక్టర్ లో అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ట్రాక్టర్​ డ్రైవర్​ కొర్స  రాజేశ్​ను, బియ్యం తరలింపునకు కారణమైన షేక్ అజీమ్ ట్రాక్టర్​ వెంటనే వస్తుండగా అతడిని అందుపులోకి తీసుకున్నారు.  బైక్ ను స్వాధీనం చేసుకొని, రేషన్ బియ్యం తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిద్దరితోపాటు డీలర్ మిడియం తులసమ్మ పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.