దివాణం బజారులో అక్రమంగా నిల్వచేసిన ఇసుక సీజ్

అశ్వారావుపేట, వెలుగు : అక్రమంగా నిల్వచేసిన ఇసుకను శనివారం రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి సీజ్ చేశారు. తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం..

 అశ్వారావుపేట పట్టణంలోని దివాణం బజారులోఇసుకను అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులతో కలిసి రెవెన్యూ సిబ్బంది దాడులు చేశారు. 106.55 క్యూబిక్  మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్​ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీరాముల శ్రీను పాల్గొన్నారు.