హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంటికి వెళ్లి గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. దీంతో లోపలికి వెళ్లిన మనోజ్ దంపతులపై మోహన్ బాబు ,అతడి బౌన్సర్లు దాడి చేశారు. లోపలికి ప్రవేశించిన మీడియాపై ఆవేశంతో ఊగిపోయిన మోహన్ దాడి చేశారు. ఈ ఘటనలో కెమరాలు,మైకులు ధ్వంసం అయ్యాయి. ఇద్దరు రిపోర్టర్లకు గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో మోహన్ బాబు ఇంటి దగ్గరకు భారీగా పోలీసులు చేరుకున్నారు.
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో వెంటనే మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ కు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి గన్స్ ను స్వాధీనం చేసుకోవాలని రాచకొండ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు మోహన్ బాబు,విష్ణు గన్ లను సీజ్ చేశారు.
Also Read :- మీడియాపై మోహన్ బాబు దాడి
డిసెంబర్ 10 రాత్రి డీజీపీని కలిసిన తర్వాత మోహన్ బాబు ఇంటికి వెళ్ళిన మనోజ్ దంపతులు నేరుగా జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంట్లోకి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ కారును ఇంటి బయట గేట్ దగ్గరే సిబ్బంది ఆపేశారు. కారు దిగిన మనోజ్ దంపతులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది రాకుండా అడ్డుకున్నారు. దీంతో చాలా సేపు గేట్ వద్ద నిల్చున్న మనోజ్ తనను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన కూతురు లోపలే ఉందని.. తనను ఇంట్లోకి వెళ్లనివ్వాలని మనోజ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
దీంతో బలవంతంగా గేట్లు తోసుకుని మనోజ్ ఇంట్లోకి వెళ్లాడు. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఇంట్లోకి వెళ్లిన జరల్నిస్టులపై మోహన్ బాబు దాడికి దిగారు. తీవ్ర కోపాద్రిక్తుడైన ఆయన జర్నలిస్టుల మైకులు, కెమెరాలు లాక్కున్నాడు. ఈ నాటకీయ పరిణామాలతో జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది.