సూర్యాపేట జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత

మఠంపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రామాంజనేయులు వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు అల్లీపురంలోని రాధిక రైస్ మిల్లుపై పోలీసులు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 250 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైస్​ మిల్లు యజమానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు. 

మిర్యాలగూడలో 30 క్వింటాళ్లు.. 

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని షాబునగర్ లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వన్ టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ వివరాల ప్రకారం.. షాబునగర్ లో నివాసం ఉంటున్న అవదారపు రాము రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోసులు దాడులు చేసి సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.