
అమరావతి: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం లారీని పట్టుకున్నారు అటవీ అధికారులు. నెల్లూరు జిల్లా, ఆత్మకూరు అటవీ ప్రాంతంలోని నెల్లూరు పాలెం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న లారీని అటవీ అధికారులు పట్టుకున్నారు. లారీలో ఉన్న 194 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వాటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని తెలిపారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని, వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు పోలీసులు.