మునుగోడులో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు ఫంక్షన్ హాళ్లు.. ఫాంహౌస్ లలో అడ్డా పెట్టి ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. గట్టుప్పల్ లో TRS నేతల నుంచి 3 లక్షల రూపాయల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉదయం నుంచి అడ్డగోలుగా డబ్బులు పంచుతూ పట్టుబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. నాన్ లోకల్ లీడర్లే.. పోలింగ్ రోజు కూడా మునుగోడులో మకాంపెట్టి పంపకాల పర్వం కొనసాగిస్తున్నారు. అయినా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు.
మరోవైపు గట్టుప్పల్ మండలం రంగం తండాలో గ్రామస్తులు ఎన్నికను బహిష్కరించారు. గ్రామంలో మౌలిక వసతులు లేవంటూ నిరసనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓటు వేయమని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తండా వాసులు చెబుతున్నారు. తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి.