ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలో గుట్కాను సమూలంగా రూపుమాపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైమండ్ ట్రాన్స్పోర్ట్ గోడౌన్, అంబేద్కర్ చౌక్ సమీపంలోని అస్లాం ట్రేడర్స్‌లో ఆకస్మిక దాడి చేసి రూ.44.19 లక్షల విలువైన నిషేధిత గుట్కాను పట్టుకున్నట్లు తెలిపారు.
గుట్కా వ్యాపారం చేస్తున్న ఎస్కే రహమతుల్లా, అర్బాజ్ ఖాన్( అస్లాం ట్రేడర్స్), సైఫుల్లా ఖాన్, షమీముల్లా ఖాన్, ఫసిఉల్లా ఖాన్, సాజిదుల్లా ఖాన్‌పై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అక్రమ గుట్కా వ్యాపారం చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.