ఖమ్మం టౌన్,వెలుగు : ఖానాపురం పీఎస్ పరిధిలోని కొత్తగూడెం సమీపంలో ఉన్న మామిడి తోటలో ఆదివారం అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని లారిలోకి లోడ్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ కు రవాణా చేస్తున్నట్టు తెలిపారు.
లారీని పోలీసులకు అందించామని సివిల్ సప్లై ఖమ్మం అర్బన్ డీటీ మహమ్మద్ ఆన్సర్ తెలిపారు. లారీ డ్రైవర్, మరో ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేశారు.