అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

పెనుబల్లి, వెలుగు : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏపీ పోలీసులు తెలిపిన ప్రకారం.. తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్లను ఆంధ్రాకు తీసుకెళ్తుండగా ఏపీ స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో పోలీసులు ఎన్టీఆర్​ జిల్లా గంపలగూడెం మండలం లింగాల వద్ద దాడులు చేశారు. ఒక వ్యక్తి స్కూటీపై తరలిస్తున్న 904 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.