మద్దూరు మండలంలో 28 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

 మద్దూరు మండలంలో 28 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

మద్దూరు, వెలుగు : దేవరకద్ర నుంచి కర్ణాటక  కు బొలెరో  లో అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ళ పీడీఎస్  బియ్యాన్ని పోలీసులు  పట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో   మద్దూరు మండలంలోని భూనీడ్ శివారులో బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.  దాంట్లో బియ్యం ఉండటంతో..  వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

సివిల్ సప్లై డీటీ ఆనంద్ పంచనామా చేసి,  ఓనర్ దుబ్బ శ్రీనివాసులు,డ్రైవర్ పరుశురాం పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.   పీడీఎస్ రైస్ ను ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా, ఇతరులకు అమ్మిన వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.