బచ్చన్నపేట,వెలుగు: ఓవ్యక్తి అక్రమంగా ఆరు క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా బుధవారం బచ్చన్నపేట పోలీసలు పట్టుకున్నారు. బచ్చన్నపేట ఎస్సై సతీశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ కేసు విషయమై పోలీసులు కొన్నె గ్రామానికి వెళ్లి వస్తుండగా.. టాటా సుమోలో పీడీఎస్ బియ్యం లోడుతో ఎదురు పడింది. అనుమానంతో హెడ్ కానిస్టేబుల్ నర్సిరెడ్డి తనిఖీ చేయగా ఆరు క్వింటాళ్ల బియ్యం ఉన్నాయి.
వాహనాన్ని పోలీస్టేషన్‌కు తరలించారు. బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తి సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం వట్టిపల్లి గ్రామానికి గగులోత్ శంకర్‌గా గుర్తించారు. బియ్యం స్వాధీనం చేసుకొని శంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.