
జహీరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో కిడ్నాప్‌కు గురైన చిన్నారిని శనివారం రాత్రి జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీసులు నగంలో చిన్నారి కిడ్నాప్‌కు గురైందని జహీరాబాద్ డీఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే ఆయన ఆదేశాల మేరకు జహీరాబాద్ బస్ స్టేషన్లో హైదరాబాద్ నుంచి వచ్చే కర్నాటక, మహారాష్ట్ర బస్సులను చెక్ చేయగా కర్నాటక బస్సులో నుస్రత్ షాజహాన్ అనే మహిళ పాపతో కనిపించింది.
ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ చేసి తీసుకొని వెళుతున్నట్టు ఒప్పుకుంది. కిడ్నాప్ చేసిన మహిళ ఆచిన్నారి కేర్ టెకర్ కావడం విశేషం. ఆదివారం మాదన్నపేట పోలీసులు జహీరాబాద్ కు చేరుకోవడం తో వారికి చిన్నారి తో సహా కిడ్నాప్ చేసిన నిందితురాలిని అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.