మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో దారుణ హత్యకు గురైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి సోమవారం (జనవరి 27) మీడియాకు వెల్లడించారు. మునీరాబాద్ దగ్గర కల్వర్టులో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు 2025, జనవరి 24న పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ముఖం గుర్తు పట్టలేనంతంగా చిధ్రం కావడంతో - మృతురాలు కట్టుకున్న చీర, ఆభరణాలు, గాజులు తదితర ఆధారాలతో దర్యాప్తు మొదలుపెట్టారు.
మహిళా చేతిపై ఉన్న పచ్చ బొట్టు పేర్ల ఆధారంగా మృతురాలిని నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన శివానంద(45)గా గుర్తించారు. -శివానందకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంట్లో గొడవల కారణంగా - హైదరాబాద్ వచ్చి కొంపల్లిలోని కుషాయిగూడలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో మేడ్చల్ బస్టాండ్ వద్ద షేక్ ఇమామ్ అనే వ్యక్తితో మహిళకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఏకాంతంగా గడిపేందుకు మునీరాబాద్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగా ఇద్దరి మధ్య అక్కడ డబ్బుల విషయంలో గొడవ జరిగింది.
ALSO READ | మిర్యాలగూడలో అమృత-ప్రణయ్కు జరిగినట్టే.. సూర్యాపేటలో అమానుష ఘటన..
మృతురాలు డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడంతో గొంతు పిసికి, బండరాయితో హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు ఇమామ్ విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడు షేక్ ఇమామ్ కరీంనగర్ జిల్లా కమలాపూర్ చెందిన వ్యక్తి అని.. అతడు స్టోన్ కట్టర్‌గా పని చేస్తున్నాడని వెల్లడించారు. ఘటన స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించి.. 2025, జనవరి 27న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -నిందితుడు గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. షేక్ ఇమామ్‌పై హత్యా, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.