మూడ్రోజుల పోలీస్ ​కస్టడీకి వీరరాఘవరెడ్డి

మూడ్రోజుల పోలీస్ ​కస్టడీకి వీరరాఘవరెడ్డి

చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్​పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో ఈనెల 18,19,20 తేదీల్లో విచారించనున్నారు. ఆయనను మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా లేదా రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో విచారిస్తారా అనే విషయం మాత్రం తెలియలేదు.