- వరంగల్, హనుమకొండలో స్పెషల్ డ్రైవ్లు.... 348 వెహికిల్స్ సీజ్
- ఓనర్స్‌పై చీటింగ్ కేసులు
హనుమకొండ : ట్రాఫిక్ రూల్స్ అన్ ఫాలోయింగ్ అవుతున్న బైక్ బాబుల బెండు తీస్తున్నారు పోలీసులు. వరంగల్, హనుమకొండలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. సీపీ ఏవీ.రంగనాథ్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్స్పేరిట తనిఖీలు చేపడుతున్నారు. వెహికిల్ ను సీజ్ చేసి, బండి ఓనర్ పై చీటింగ్ కేసులు పెడుతున్నారు. జవవరి నుంచి ఇవాల్టి వరకు వరంగల్ నగరంలో 348 బండ్లు సీజ్ చేశారు. ఇందులో 4 కార్లు, ఆటో, బైక్ 343 ఉన్నాయి. హనుమకొండ పరిధిలో అత్యధికంగా 126, వరంగల్ పరిధిలో 93, కాజీపేటలో 72 బండ్లు, మిగతా వాటిని వివిధ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. వాహనాదారులు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేకుండా బండ్లు రోడ్డెక్కితే సీజ్ చేసి స్టేషన్కు తరలిస్తామని హెచ్చరించారు.