ఆదిలాబాద్​జిల్లాలో.. పోలీసుల స్పెషల్ ​డ్రైవ్ .. 321 వాహనాలు సీజ్

ఆదిలాబాద్​జిల్లాలో.. పోలీసుల స్పెషల్ ​డ్రైవ్ .. 321 వాహనాలు సీజ్

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​జిల్లాలో పోలీసులు వారం రోజులుగా నిర్వహిస్తున్న నెంబర్ ​ప్లేట్ ​లేని వాహనాల స్పెషల్​ డ్రైవ్ ​కొనసాగుతోంది. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్​ చౌరస్తాలో ట్రాఫిక్​పోలీసులు నెంబర్ ​ప్లేట్​లేని 50 వాహనాలను సీజ్​ చేశారు. వారం రోజులుగా కొనసాగుతున్న తనిఖీల్లో మొత్తం 321 వెహికల్స్​ను తాత్కాలికంగా సీజ్ చేసి, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు ఆధారంగా నెంబర్​ ప్లేట్లను ఏర్పాటు చేయించారు.

నెంబర్​ ప్లేట్ లేని వెహికల్స్​కు జరిమానా విధించి విడిచిపెట్టారు. కావాలనే నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వారి వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్​ సీఐ ప్రణయ్​ తెలిపారు. నెంబర్​ ప్లేట్లు మార్చి తిరిగితే చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.