కరీంనగర్ క్రైమ్, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులకు నిర్వహిస్తున్న 2024 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శుక్రవారం ముగిశాయి. కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ముగింపు ప్రోగ్రామ్‌కు మల్టీజోన్ ఐజీ ఏవీ రంగనాథ్ హాజరయ్యారు. తొలుత కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి బొకే ఇచ్చి ఆయనకు స్వాగతం పలకగా, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం జట్ల వారీగా స్పోర్ట్స్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్టీజోన్ ఐజీ మాట్లాడుతూ పని ఒత్తిడిలో ఉన్న పోలీసులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మీట్‌లో భాగంగా సిబ్బందికి 12 క్రీడల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.