
మెదక్, వెలుగు: పోలీస్ స్టేషన్ రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. మెదర్ రూరల్ పీఎస్ అదుపులో ఉన్న మున్సిపాలిటీ పరిధిలోని ఆవుసులపల్లికి చెందిన కందుల రాము అలియాస్ చంద్రం వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు పీఎస్‌లో రైటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ బి. సురేందర్ రూ.4 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
మంగళవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ సంగారెడ్డి డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఫిర్యాదు దారున్ని బెయిల్‌పై విడుదల చేయడానికి కూడా రూ.15 వేలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కానిస్టేబుల్ సురేందర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరచనున్నట్టు తెలిపారు. దాడిలో నిజామాబాద్ డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐలు వెంకట్ రాజాగౌడ్, రమేశ్, నగేశ్, సిబ్బంది పాల్గొన్నారు.