కాంగ్రెస్ కాళేశ్వరం యాత్ర.. అడ్డుకున్న పోలీసులు

కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్  సందర్శించేందుకు  వెళ్తున్న మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మూడు పిల్లర్లు ఇటీవల కుంగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  పొన్నం ప్రభాకర్ చలో కాళేశ్వరానికి పిలుపునిస్తూ హుస్నాబాద్ నుండి మూడు బస్సులో పార్టీ కార్యకర్తలు, పలువురు రైతులను తీసుకుని వెళ్తుండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం  బొమ్మపూర్ లోని  మందరగిరి వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో  పోలీసులు అడ్డుకున్నారు. 

పొన్నం ప్రభాకర్ తో పాటు మరో ముగ్గురికి మాత్రమే ప్రాజెక్టు సందర్శనకు అవకాశం ఉంటుందని పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. మిగతా వారిని  పోలీసులు అడ్డుకోవడంతో.. నిరసనగా రోడ్డుపై బైటాయించిన ఆందోళన చేందోళ చేస్తున్నారు.