పౌరహక్కుల నేతల అరెస్ట్

కొత్తగూడెం: పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్​, కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. దీనికి సంబంధించి ఎన్​కౌంటర్​పై నిజనిర్ధారణకు రఘునాథపాలం ఫారెస్ట్​ ఏరియాకు వెళ్తుండగా మణుగూరులో పోలీసులు వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. 

అక్కడి నుంచి అవారిని శ్వాపురం పీఎస్​కు తరలించి, గేటుకు తాళాలు వేసి భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై పౌర హక్కుల నేతల మండిపడ్డారు. పౌర హక్కుల నేతలను అరెస్ట్​లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. ఎన్​కౌంటర్​ వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్​లు చేయడం దారుణమన్నారు.  

తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు..

పౌర హక్కుల నేతలు కాల్పుల ఏరియాకు వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అలెర్ట్​ అయ్యారు.  ఇవాళ తెల్లవారుజాము నుంచి పినపాక నియోజకవర్గ పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఏడు మండలాల్లో చెక్​ పోస్ట్​లు ఏర్పాటు చేసి, రాకపోకలు సాగించే వాహనాలను ఆపి, ప్యాసింజర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెక్ పోస్ట్​ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ALSO READ : ఎక్కడికక్కడ బీఆర్ఎస్​ లీడర్ల అరెస్ట్