కొత్త సెక్రటేరియట్‌ను ఫోటో తీస్తున్నాడంటూ ఓ ఫోటోగ్రాఫర్ పై పోలీసులు దాడి చేశారు. అతని నుంచి కెమోరా లాక్కున్నారు. ఎందకు ఫోటోలు తీస్తున్నావంటూ నిలదీశారు. రోడ్డుపై నిలబడి సెక్రటేరియట్ ఫోటో తీస్తుంటే అడ్డుకోవడం ఎంటని ఫోటోగ్రాఫర్ అడిగిన పోలీసులు పట్టించుకోలేదు. పాత సెక్రటేరియట్ కూల్చివేత నుంచి కొత్త సెక్రటేరియట్ నిర్మాణం వరకు అంతా నిర్భందంలోనే కొనసాగుతోంది. ఓ దిక్కు పోలీసుల బందోబస్త్ , మరోవైపు ప్రైవేటు సెక్యూరిటీ పెట్టి నిర్మాణ పపనులు కొనసాగిస్తున్నారు.
ఏప్రిల్ 30న కొత్త సెక్రటేరియట్ ప్రారంభం..
కొత్త సెక్రటేరియట్ ను ఏప్రిల్ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే స్మృతి వనాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.