జనగామ జిల్లా: లంచాలు తీసుకునే వారిని వలపన్ని పట్టుకునే అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇవాళ సొంత పోలీసు శాఖ సబ్ ఇన్స్ పెక్టర్ ను పట్టుకున్నారు. జనగామ జిల్లా నర్మెట్ట ఎస్ఐ రవికుమార్ 25వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తున్న ఈ ఏసీబీ దాడి వివరాలు ఇలా ఉన్నాయి.
యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలానికి చెందిన గుర్రాల రామకృష్ణ అనే వ్యక్తి నుండి నర్మెట్టలోని ఓ భూమి సెటిల్మెంట్ విషయంలో ఎస్.ఐ రవికుమార్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇవాళ సోమవారం నర్మెట్ట పోలీసు స్టేషన్లో గుర్రాల రామకృష్ణ అనే వ్యక్తి నుండి 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదే సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. లంచం డబ్బును కెమికల్ తో టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
కాలేజీ విద్యార్థినులతో స్టెప్పులేసిన కలెక్టరమ్మ
స్వాతంత్ర పోరాటంపై ఢిల్లీలో ఎగ్జిబిషన్