ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకపరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్ ను కోర్టుకు సమర్పించారు పోలీసులు. మూడు బాక్సుల్లో ఆధారాలను కోర్టుకు సమ ర్పించారు. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, సీడీలను కోర్టుకు అందజేశారు. అన్నింటిని జతపర్చుతూ మూడోసారి చార్జిషీట్ దాఖలు చేశారు పోలీ సులు.
తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం కూడా జరిగింది. ఈ కేసులో పోలీసుల బెయిల్ మంజూరుపై మంగళవారం విచా రించిన నాంపల్లి కోర్టు.. మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది .రేపు(బుధవారం జూన్ 26) తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.