
పంజాగుట్ట, వెలుగు: బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ఇంటి ఎదుట సోమవారం బంజారాహిల్స్‌పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం గ్రూప్–1 మెయిన్స్నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచే నందినగర్‌లోని కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
అయితే, ఏసీపీ సామల వెంకటరెడ్డితో కేటీఆర్మాట్లాడారు. తాను అశోక్‌నగర్‌కు గానీ, గ్రూప్1 ఎగ్జామ్జరిగే ప్రాంతాలకు గానీ వెళ్లడం లేదని.. వెళ్తే చెప్పే వెళ్తానని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్యాదవ్తదితరులు కేటీఆర్ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేటీఆర్ వారితో కలిసి ఈఆర్సీ ఆఫీసుకు వెళ్లారు. వారి వెంటే ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర వెళ్లారు.