462 ఎకరాల్లో గంజాయి సాగు

462 ఎకరాల్లో గంజాయి సాగు

ఒడిశా పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  గజపాటి జిల్లాలో గంజాయి సాగుచేస్తున్నారనే పక్కసమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 9లక్షల గంజాయి మొక్కల్ని నాటినట్లు గుర్తించారు. 462 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని ధ్వంసం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంజాయి పెంపకంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయిని ఎవరు సాగు చేస్తున్నారు…?ఎవరి ప్రమేయంతో సాగు చేస్తున్నారనే విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నారు.