పండగ పూట అత్యాశకు పోతే అకౌంట్ ఖాళీ అవుతది జాగ్రత్త..! సైబర్ క్రైమ్ పోలీసుల సూచన

హైదరాబాద్: సంక్రాంతి పండగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పండగ వేళ ఆఫర్ల పేరిట సైబర్ కేటుగాళ్ల కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఉచిత రీ ఛార్జులు, గిఫ్ట్‎లు అంటూ ఆశ చూపి బురిడి కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సూచనలు చేశారు. సంక్రాంతి బంపర్ ఆఫర్ల మాయలో పడొద్దని.. ఉచిత రీచార్జ్ అని వచ్చే మెసేజ్‏లను నమ్మొద్దని సూచించారు. 

లింక్ మరో 10 మందికి షేర్ చేస్తే ఫ్రీ రీచార్జ్ వస్తుందన్నది ఫేక్ అని.. పండుగ సీజన్‎ను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు బంపర్ ఆఫర్ అని ఊరించే ప్రకటనలు చేస్తే ఆశపడి ఆ లింక్ క్లిక్ చేయొద్దన్నారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కితే అకౌంట్ ఖాళీ అవుతోందని చెప్పారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ క్లిక్ చేస్తే ఫ్రీ రీఛార్జ్ రాదని.. మీ ఫోన్‎లో మాల్వేర్ ఇన్ స్టాల్ అవుతోందని తెలిపారు. 

ALSO READ | జాగ్రత్తగా ఉండాలె.. బ్యాంకు ఖాతా KYC పేరుతో రూ. 13 లక్షలు కొట్టేశారు

అత్యాశ పోయి సైబర్ మోసాలకు గురి అయ్యి పండుగ పూట బాధ పడొద్దని సూచించారు. గుర్తు తెలియని నెంబర్ల నుండి వచ్చే మేసేజులు, ఫోన్ల విషయంలో క్షణమాగి ఆలోచించి ఆ తర్వాత స్పందించడని చెప్పారు. ప్రస్తుతం పెరిగిపోయిన డిజిటల్‌ మోసాలపై ఆందోళన చెందకుండా, అప్రమత్తంగా ఉండండిన సూచించారు. గుర్తు తెలియని అనుమానిత నెంబర్ల నుండి ఫోన్లు, మేసేజులు వచ్చిన, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండని సూచించారు. లేదంటే సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.