పోలీసు కస్టడీకి కొరియోగ్రాఫర్ జానీ..

పోలీసు కస్టడీకి కొరియోగ్రాఫర్ జానీ..

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీకి మరో షాక్ తగిలింది. జానీని 4రోజుల పొలిసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రంగారెడ్డి జిల్లాకోర్టు. రిమాండ్ లో ఉన్న జానీని కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ పై బుధవారం ( సెప్టెంబర్ 25, 2024 ) విచారణ జరిపిన కోర్టు 4రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read :- హర్షసాయిపై రేప్ కేసు నమోదు

అయితే, ఇప్పటికే బాధితురాలి నుండి పలు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు వాటి ఆధారంగా జానీని ప్రశ్నించనున్నారు.ఇదిలా ఉండగా.. జానీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.కాగా పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.