ఓబులవారిపల్లెలో పోసాని.. పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు

ఓబులవారిపల్లెలో పోసాని.. పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు

సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. పోలీస్ స్టేషన్ లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు ఆయన స్టేట్ మెంట్ తీసుకున్నారు. తర్వాత రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు. 

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బుధవారం (ఫిబ్రవరి 27) హైదరాబాద్‌ రాయదుర్గంలోని మైహోమ్‌ భూజా అపార్ట్ మెంట్ లో పోసానిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఇవాళ (గురువారం) ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు.  

సినీ పరిశ్రమలో వర్గవిభేదాలు తలెత్తేలా, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి  ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 

Also Read:-పోసానికి అన్నం తినే అవకాశం కూడా ఇవ్వని పోలీసులు..

వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదయ్యింది.