8047 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ పూర్తి

  • నవంబర్ 21 పాసింగ్ ఔట్ పరేడ్

హైదరాబాద్, వెలుగు: పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 8047 మంది కానిస్టేబు ల్స్ విధుల్లో చేరారు. 2023–24 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్స్ గురువారం పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా19 పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ లో ఈ 8047 మంది కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 4,116 మంది సివిల్‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్స్‌‌‌‌ , 3,685 మంది ఆర్మ్‌‌‌‌డ్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ (ఏఆర్‌‌‌‌) కానిస్టేబుల్స్‌‌‌‌, 228 మంది ఐటీ కమ్యూనికేషన్స్‌‌‌‌ కానిస్టేబుల్స్‌‌‌‌, 18 మంది పోలీస్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ (పీటీఓ) కానిస్టేబుల్స్‌‌‌‌ ఉన్నారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో జరుగనున్న పాసింగ్ ఔట్ పరేడ్ లో చీఫ్ గెస్ట్ గా డీజీపీ జితేందర్ పాల్గొననున్నారు.