కామారెడ్డి జిల్లాలో రోడ్డు రోలర్ తో సైలెన్సర్లు ధ్వంసం

కామారెడ్డి జిల్లాలో రోడ్డు రోలర్ తో సైలెన్సర్లు ధ్వంసం
  • వెహికల్స్​తో శబ్ధ కాలుష్యం చేస్తే చర్యలు : ఏఎస్సీ చైతన్య రెడ్డి 

కామారెడ్డి టౌన్, వెలుగు:  కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధిక సౌండ్​ వచ్చేలా బిగించుకొని శబ్ధ కాలుష్యం చేస్తున్న 65 సైలెన్సర్లను రోడ్ రోలర్ తో పోలీసులు తొక్కించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్‌లో ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు రోలర్‌‌తో తొక్కించి ధ్వంసం చేశారు.   టౌన్‌లో విస్తృతంగా వెహికిల్స్​ తనిఖీలు చేపట్టగా 2 నెలల కాలంలో  అధిక శబ్ధం వచ్చే  65 వెహికిల్స్​ సైలెన్షర్లను తొలగించి  సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. 

 ఏఎస్సీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ..    ఇక మీదట ఎవరూ కూడా ఎక్కువ సౌండ్ వచ్చే సైలెన్సర్లను వాడకూడదన్నారు.  రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్​  సీఐ చంద్రశేఖర్​రెడ్డి,  ఎస్సైలు  శ్రీరామ్​, మహేశ్ పాల్గొన్నారు.