ఆలోచింపజేసేలా పోలీస్ వారి హెచ్చరిక

ఆలోచింపజేసేలా పోలీస్ వారి హెచ్చరిక

అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’.  సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, శుభలేఖ సుధాకర్, షాయాజీ షిండే, హిమజ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  బెల్లి జనార్థన్  నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన జయసుధ, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ,  ఆర్ నారాయణ మూర్తి మంచి కంటెంట్‌‌తో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుతూ టీమ్‌‌కు ఆల్  ద బెస్ట్ చెప్పారు. 

అజయ్ ఘోష్ మాట్లాడుతూ ‘ఇందులో నేను చాలా గొప్ప పాత్రను పోషించాను. అందర్నీ ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి థ్యాంక్స్’ అని చెప్పాడు. షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు అన్నారు.