మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా ఎస్సై.. గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడింది. ఎస్ఐ సోనం పరాశర్ రోజువారి చెకింగ్‌లో భాగంగా రోడ్డు పై విధులు నిర్వహిస్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతని వద్దకు వెళ్లిన సోనం.. అతడితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. అంబులెన్స్ కు ఫోన్ చేసింది. అతడు గుండెనొప్పితో మరింత ఇబ్బంది పడటం చూసి సీపీఆర్ చేసి.. అంతలో అంబులెన్స్ రావడంతో ఆస్పత్రికి తరలించింది.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సై సోనంను సన్మానించారు. మరోవైపు సదరు మహిళా పోలీస్ సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.