hathras stampede: డెడ్‌బాడీల కుప్పలు చూసి పోలీస్ మృతి : 116కి మృతుల సంఖ్య

hathras stampede: డెడ్‌బాడీల కుప్పలు చూసి పోలీస్ మృతి : 116కి మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం బోలో బాబా ప్రవచనాలకు వచ్చిన భక్తులు మధ్య జరిగిన తొక్కీసలాటలో అనేక మంది చనిపోయిన విషయం తెలిసిందే. జూలై 2 సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 116కు చేరింది. హాస్పిటల్ లో కుప్పలు తెప్పలుగా పడిఉన్న మృతదేహాలను చూసి రజనీష్ అనే పోలీస్ అధికారి గుండెపోటుతో చనిపోయాడు. 

ఎటా మెడికల్ కాలేజీలో అత్యవసర విధులు నిర్వహిస్తున్న క్యూఆర్‌టి సిబ్బంది రజనీష్  మరణించాడు. అవాఘర్‌లోని క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టి)లో భాగమైన అతను అత్యవసర విధుల కోసం ఆసుపత్రికి పిలిచాడు. హత్రాస్ జిల్లా ఫుల్రాయ్ గ్రామంలో సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది భక్తులు మరణించారు. వారి మృతదేహాలను ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ దృశ్యాన్ని చూసిన రజనీష్ హాట్ ఎటాక్ లోనైయ్యాడు.

హత్రాస్ తొక్కిసలాటలో పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని సీఎం యోగి ఆదిత్య నాథ్ కు అమిత్ షా హామీ ఇచ్చారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఘటన పూర్వాపరాలను హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం త్వరలో హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.