-
కృతజ్ఞతగా సీపీ ముందు పాట పాడిన మొగులయ్య
ఎల్బీనగర్, వెలుగు: పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు అన్యాయం జరగనివ్వబోమని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మొగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 600 గజాల ఇంటి స్థలం చుట్టూ ఏర్పాటు చేసుకున్న ప్రహరీ గోడను ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో మొగులయ్య హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు గోడను తిరిగి కట్టించారు. సోమవారం ఎల్బీనగర్ ఆఫీసులో రాచకొండ సీపీ సుధీర్బాబును కలిసిన మొగులయ్య భీమ్లానాయక్ పాట పాడి వినిపించారు. ప్లాట్ విషయంలో జరిగిన వివరాలను సీపీకి తెలిపారు. భూమి పరిరక్షణకు పూర్తి బాధ్యత తీసుకుంటామని సీపీ భరోసా ఇచ్చారు.