కోటి పాలసీలు అమ్ముతం... పీబీ పార్ట్‌‌‌‌నర్స్ ప్రకటన

కోటి పాలసీలు అమ్ముతం... పీబీ పార్ట్‌‌‌‌నర్స్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: గత ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల పాలసీలు అమ్మామని, ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి పాలసీలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్​కు చెందిన  పీబీ పార్ట్‌‌‌‌నర్స్ ప్రకటించింది.  పాయింట్స్ ఆఫ్ సేల్ పర్సన్ మోడల్​ను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు తెలియజేసింది. కంపెనీ హైదరాబాద్‌‌‌‌లో వచ్చే నెల కాల్​ సెంటర్​ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది.

నగరంలో కాంప్రహెన్సివ్​,  మాడ్యులర్, మోటార్ బీమా ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, మొత్తం బీమాలో వీటి వాటా 75 శాతం ఉందని పేర్కొంది. తమ పాలసీల్లో కమర్షియల్​ వెహికల్స్​పాలసీలు అత్యధికంగా 48శాతం అమ్ముడవుతున్నాయని, తరువాత ప్రైవేట్ వెహికల్స్​వాటా 35శాతం ఉందని కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ అమిత్​బదోరియా చెప్పారు. రాష్ట్రంలో తమకు 5,500పైగా​ ఏజెంట్లు ఉన్నారని వెల్లడించారు.   2027–-28 నాటికి, వైజాగ్, తిరుపతి, కోయంబత్తూర్ వంటి నగరాల్లో దాదాపు 1,7-18 ఆఫీసులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.