ట్రిపులార్(RRR) సూపర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala shiva) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం.. తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తాజాగా ఎన్టీఆర్ దేవర షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెకేషన్ వెళ్లారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ పై రాజకీయ పరంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పదించలేదు. దీంతో ఎన్టీఆర్ పై టీడీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కావాలనే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా అవేమి పట్టనట్టుగా ఫామిలీతో దుబాయ్ కి వెకేషన్ కు వెళ్లడంపై కామెంట్స్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.
Also Read : అల్లు అర్జున్ అభిమాని మృతి.. చివరికోరిక తీర్చడానికి సిద్దమైన ఐకాన్ స్టార్.. కానీ!
ఈ విషయంలో ఆయన ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారని.. తన సినిమాలపైనే ఫోకస్ పెట్టారని. రాజకీయాల్లో లేని వ్యక్తి.. రాజకీయాల గురించి మాట్లాడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.