మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు రాజకీయ, ప్రజాసంఘాల నివాళి

మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు రాజకీయ, ప్రజాసంఘాల నివాళి

మాజీ ప్రొఫెసర్ G. N. సాయిబాబాకు నివాళులర్పించారు రాజకీయ, ప్రజాసంఘాల నేతలు. సాయిబాబా పార్ధివదేహాన్ని నిమ్స్ హాస్సిటల్ నుంచి అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ దగ్గరకు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అంతకు ముందు నిమ్స్ లో ప్రజా సంఘాల లీడర్లు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. గన్ పార్క్ లో సాయిబాబా పార్థివదేహానికి ఉద్యమ పాటలతో నివాళులు అర్పిస్తున్నారు.

తర్వాత గన్ పార్క్  నుంచి పార్థివదేహాన్న మౌలాలిలోని ఇంటికి తరలించనున్నారు కుటుంబ సభ్యులు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శన కోసం పార్దివదేహాన్ని ఉంచుతారు. రెండున్నర గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై.. 4 గంటల వరకు సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకుంటుంది. సాయిబాబా పార్దివదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ కి డొనేట్ చేయనున్నారు కుటుంబసభ్యులు. ఇప్పటికే ఆయన కళ్ళను LV ప్రసాద్ కంటి హాస్పిటల్ కు డొనేట్ చేశారు.