ఎన్నికల వేళ వినాయక విగ్రహాలు ఇచ్చేందుకు నేతలు పోటీ పడుతున్నరు. నేనంటే నేనే ఇస్తానంటూ పంతాలకు పోతున్నారు. నల్గొండ హనుమాన్‌నగర్‌లో ఏటా పెద్ద గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సారి అక్కడ విగ్రహం ఇచ్చేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, రెబల్ నేతలు పోటీ పడ్డారు. దీంతో డ్రా తీయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ పేర్లతో డ్రా తీశారు. ఇందులో ఎంపీ వెంకటరెడ్డి పేరు వచ్చింది. ఇంకేముంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చిర్రెత్తింది.
అసలు డ్రా ఎవడు తీయమన్నాడంటూ ఉత్సవ కమిటీపై చిందులు వేశారట. ఎవరొచ్చి పూజలు చేస్తారో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారట. కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ అధికారులు అక్కడ అడుగుపెడతానికి వీళ్లే దని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదిలా ఉంటే విగ్రహాలు ఫ్రీగా వస్తుండడంతో నల్గొండ టౌన్లో ఈ సారి ప్రతి 30 ఇండ్లకు ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ALSO READ: టీచర్ల ప్రమోషన్లకు టెట్ ఎఫెక్ట్.. సీనియర్లు దూరమయ్యే చాన్స్
ఎంపీ వెంకటరెడ్డి 9 ఫీట్ల విగ్రహాలు పంచుతుంటే.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పది ఫీట్ల విగ్రహాలు ఇస్తున్నారు. తానేం తక్కువ కాదన్నట్టు అసమ్మతి నేత పిల్లి రామరాజు ఏకంగా 11 ఫీట్ల విగ్రహాలు ఇస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక మండపాల పక్కన పొలిటికల్ లీడర్ల బొమ్మలతో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.