- 32 జెడ్పీ చైర్మన్లు
- 535 జెడ్పీటీసీలు
- 535 ఎంపీపీలు
- 5,857ఎంపీటీసీలు
- స్థానిక సంస్థల ఎన్నికలతో లీడర్లకు పదవులే పదవులు
- టికెట్ల కోసంఆశావహుల ప్రయత్నాలు
- అధికార పార్టీ టికెట్ కోసం క్యూ ఇతర పార్టీల్లోనూ పోటీ
హైదరాబాద్, వెలుగు:పదవిలో ఉంటే గౌరవం దక్కతుందని, ఎలాగైనా పదవిని చేపట్టాలని భావించే నేతలకు స్థానిక సంస్థలఎన్నికలు కలిసిరానున్నాయి. రాష్ట్రంలో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్రఎన్నికల సంఘం వేగంగా కసరత్తు చేస్తోంది. భారీ సంఖ్యలో సీట్లు ఉండటంతో ద్వితీయ శ్రేణి నేతలు అప్పుడే తమప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా అధికారపార్టీ టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నా రు. ఇతర పార్టీల్లో నూ ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నా రు.
ఎన్నికల నిర్వహణకు వేగంగా కసరత్తు
మొత్తం 32 జిల్లా పరిషత్ లు, 535 జెడ్పీటీసీలు,5857 ఎంపీటీసీ పదవులకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ నేపథ్యంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎక్కువ సీట్లపై టీఆర్ ఎస్ గురి
టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్ని కలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లుసాధించాలని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు,ఎమ్మెల్సీలకు, నియోజకవర్గ ఇన్చార్జ్ లకు చెప్పినట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీఎన్నికల్లో టీఆర్ ఎస్ 88 సీట్లు సాధించింది. తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్దతు దారులు ఎక్కువ సీట్లలో గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలవాలని గులాబీ పార్టీ అడుగులువేస్తోంది. అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, గత నాలుగేళ్లలో నామినేటేడ్ పోస్టు ఆశించి రాని వారిలో చాలా మందిని జడ్పీ చైర్మన్లుగా సర్దుబాటు చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 32 జడ్పీ చైర్మన్లలో 16 జనరల్కు రిజర్వ్ కాగా, మిగతా 16 ఎస్సీ, ఎస్టీ, బీసీలకురిజర్వ్ అయ్యాయి.
ప్రతిపక్ష పార్టీల్లోనూ ..
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్,బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మండల కమిటీలసిఫార్సు మేరకు అభ్యర్థు లను ఎంపిక చేస్తామని కాంగ్రెస్ వెల్లడించిం ది. ఇటీవల జరిగిన లోక్ సభఎన్నికల్లో రాష్ట్రంలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ..స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇతర పార్టీలూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు సాధిం చాలని ప్రయత్నిస్తున్నాయి.
ప్రయత్నాలు షురూ
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ టికెట్ల కోసం ఆశావాహులు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించటంతో చాలా మందిలో ఆశలు చిగురిస్తున్నాయి. మొన్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ లుగా గెలిచిన వాళ్లలోనూ కొందరు ఎంపీటీసీలుగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎంపీటీసీగా గెలిచి రిజర్వేషన్ అనుకూలిస్తే ఎంపీపీ కావొచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఎంపీపీగా ఎన్నికైతే జిల్లాపరిషత్ సమావేశాలకూ హాజరు కావొచ్చని, దాంతో పరపతి పెరుగుతుందని వారు భావిస్తున్నారు.