కురవి (మరిపెడ), వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నూకల నరేశ్‌రెడ్డి శుక్రవారం గుండెపోటుతో చనిపోవడంతో ఆయన డెడ్‌బాడీని శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చారు. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై నరేశ్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళి అర్పించారు. శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో నరేశ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.
నివాళి అర్పించిన నేతలు
నరేశ్‌రెడ్డి మృతదేహం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాళి అర్పించి మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజానాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నరేశ్ రెడ్డి డెడ్‌బాడీకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, మురళీనాయక్, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శంకర్‌నాయక్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యా నాయక్, మాలోతు కవిత, కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ రామసహయం సురేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్‌రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు నివాళి అర్పించారు.