
- మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఉన్న రాజకీయ జీవితంతో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు సీఎం కావాలనే కోరిక లేదని, ఏ పదవులనూ తాను ఆశించడం లేదని తెలిపారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్ లో మీడియా తో చిట్ చాట్ చేశారు.
స్పీకర్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్ ను అవమానపరిచేలా జగదీశ్ మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగదీశ్రెడ్డిలా ఎవరూ ప్రవర్తించకూడదని అన్నారు.
ఎస్‌ఎల్‌బీసీలో రోబోలతో పనులు చేయిస్తున్నందున, సంబంధిత సంస్థకు రూ. 4 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ ఘటనతో ఎస్ఎల్‌బీసీ నిర్మాణంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, సాధ్యమైనంత త్వరలోనే పని పూర్తి చేస్తామని చెప్పారు. ఇలాంటి ప్రమాదం ఇప్పటివరకూ ఎప్పుడూ.. ఎక్కడా.. జరగలేదని, ఇక్కడ జరగడం
దురదృష్టకరమని పేర్కొన్నారు.