
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. ప్రచారం ముగిసింది. పోలింగ్ కు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు తెల్లారితే ఓటింగ్ ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాతో ఉన్నాయి. తమకు కలిసి వచ్చే అంశాలేమిటి, ప్రతికూలఅంశాలేమిటని లెక్కలు వేసుకుంటున్నాయి. ఎక్కడెక్కడ సునాయసంగా గెలుస్తామో, ఎక్కడెక్కడ గండం గట్టెక్కాల్సి ఉంటుందో బేరీజు వేసుకుంటున్నాయి. చివరినిమిషంలో చేయాల్సిన ప్రయత్నాలపై దృష్టి సారించాయి.మొత్తంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నాయి. కేంద్రంలో ఈసారి హంగ్ ఏర్పడుతుందని, 16సీట్లు గెలుచుకుంటే చక్రం తిప్పొచ్చని టీఆర్ఎస్ భావిస్తుంటే.. ఇక్కడ వీలైనన్ని సీట్లతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తోడుగా నిలవాలని రాష్ట్ర కాంగ్రెస్ యోచిస్తోంది. అటు నార్త్ ఇండియాలో సీట్లు తగ్గవచ్చన్న అంచనాలతో దక్షిణప్రాంతంలో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా కేంద్రంలో ‘పవర్’పైనే అన్ని పార్టీలుదృష్టి పెట్టాయి.
16 గెలుస్తాం .. ఢిల్లీలో చక్రం!
రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి.ఇందులో ఒకటి మిత్ర పక్షం ఎంఐఎంకు పోగా మిగతా 16 ఎంపీ సీట్లలో తమదే గెలుపని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా టీఆర్ ఎస్ ఈ లెక్కలు వేసుకుంటోం ది. సీఎంకేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఇతర సీనియర్ నేతలంతా .. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని, రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను సాధిం చుకోవచ్చని విస్తృతంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ బలం, ఏపీలో జగన్ బలం కలిస్తే 35 కి పైగా ఎంపీ సీట్లు ఉంటాయని, ఢిల్లీ మెడలు వంచడం సులువు అవుతుందని సీఎం కేసీఆర్‌స్వయంగా పేర్కొనడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఇమేజీ, సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని పార్టీ అభ్యర్థులు నమ్మకంతో ఉన్నారు. అందుకే‘సారు.. కారు.. పదహారు’, ‘అభ్యర్థులు ఎవరనేదికాదు, కేసీఆర్ ను చూసి ఓటేయండి ’ అనే నినాదాలతో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులతో సంబంధం లేకుండా కేసీఆర్ ఇమేజీతో పార్టీ మంచి మెజారిటీతో గెలిచిందని నమ్మి.. లోక్‌సభ ఎలక్షన్లలోనూ అదే విధానాన్ని రిపీట్ చేశారు. అయితే అసెంబ్లీఎలక్షన్లలో అందరు సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వగా..లోక్ సభ ఎలక్షన్లలో మాత్రం చాలా చోట్ల కొత్తవారిని,తెలంగాణ ఉద్యమంతో, రాజకీయాలతో సంబంధంలేని అభ్యర్థులను బరిలోకి దింపా రు. దాంతో కొన్నిసెగ్మెం ట్లు టీఆర్ఎస్కు టఫ్‌గా మారాయి. నిజామాబాద్ లో రైతులు భారీ ఎత్తున నామినేషన్లు వేయడం,కొత్త అభ్యర్థులున్న చోట ఎమ్మెల్యేలు , ఇతర నేతలు సహ కరించకపోవడం, వరుస ఎన్నికలతో కేడర్‌కూడా నీరస పడిపోవడం వంటివి ఇబ్బందికరంగా కనిపిస్తు న్నాయి. ముఖ్యంగా పోటీ గట్టిగా ఉండే నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, చేవెళ్ల లోక్ సభ సీట్లపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకున్నారు.
గట్టి అభ్యర్థులు, ‘న్యాయ్ ’పై కాంగ్రెస్ ఆశలు
అసెంబ్లీ ఎన్ని కల్లో గట్టి దెబ్బతినడంతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో నీరసించిం ది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం సీనియర్ నేతలను లోక్ సభ రంగంలోకి దింపింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి,బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ,సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి,మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ , అంజన్ కుమార్‌యాదవ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులను పోటీకి పెట్టింది.బలమైన నేతలు కావడం, రాష్ట్రవ్యా ప్తంగా ఇమేజీ ఉండటం నేపథ్యంలో వారు ఈజీగా నెగ్గుకువస్తారని నమ్మకం పెట్టుకుంది. రాష్ట్రంలో రాహుల్ పర్యటించడం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు.దీంతో పాటు తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలపైనా కాంగ్రెస్ ఆశ పెట్టుకుంది. ‘మాట నిలబెట్టుకుంటాం ’అనే నినాదంతో.. పేదలకు ఏటా రూ.72వేలు అందజేస్తామన్న హామీ ఓట్లు కురిపిస్తుందన్న ధీమాతో ఉంది.ఇక ఇటీవలి టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు దారులు ఓడిపోయిన నేపథ్యంలో ఉద్యోగులు, యువతలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందని,అది తమకు కలిసి వస్తుందని భావిస్తోంది.గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు.ఈ లెక్కన యువత కాంగ్రెస్ వెంట నిలుస్తుందన్న ఆశలు పెరిగాయి. అసెంబ్లీ ఎలక్షన్లు వేరని,లోక్ సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధానమంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. మోడీ ప్రభుత్వాన్నివ్యతిరేకిస్తు న్న వారంతా తమ వెంట నిలుస్తారని ఆశిస్తోంది. మొత్తంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిపించికేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకుతోడుగా నిలవాలని కోరుతోంది. ఖమ్మం, నల్గొండ,చేవెళ్ల, మల్కాజ్‌గిరి, మహబూబాబాద్ స్థానాల్లోతమ గెలుపు తథ్యమని ధీమాగా ఉంది.
ఉనికి కోసం వామపక్షాల పాట్లు
వామపక్షాలు ఉనికి కోసం పాట్లు పడుతున్నాయి.అసెంబ్లీ ఎలక్షన్లలో వేర్వేరుగా తలపడిన సీపీఐ,సీపీఎంలు .. ఇప్పుడు పరస్పర మద్దతుతో చెరో రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నాయి. భువనగిరి, మహబూబాబాద్‌లలో సీపీఐ, ఖమ్మం , నల్గొండలో సీపీఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల మధ్యే గట్టిపోరు సాగుతుండటంతో వామపక్షాల అభ్యర్థులు విజయం సాధించడంపై పెద్దగా ఆశలేమీ లేవు.