మునుగోడు బైపోల్ ప్రచారం ఊపందుకుంటుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇవాళ చౌటుప్పల్ లో బీజేపీ గొల్ల కుర్ముల ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఇప్పటికే మండల ఇంచార్జులు, సహా ఇంచార్జులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. చేరికలతో బిజీగా గడుపుతున్నారు. రేపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు మొత్తం హాజరై.. గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల వారిగా బాధ్యతలు తీసుకుని క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ ప్రస్తుతం చౌటుప్పల్ మండలంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 వరకు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా మునుగోడులో పాగా వేసేలా ప్లాన్ చేస్తున్నారు.