ఒక్క ఎలక్షన్​కురూ.వంద కోట్లు తీసుకున్నా :  ప్రశాంత్ కిశోర్

ఒక్క ఎలక్షన్​కురూ.వంద కోట్లు తీసుకున్నా :  ప్రశాంత్ కిశోర్
  • పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే

న్యూఢిల్లీ: పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు, నాయకులకు ఎన్నికల ప్యూహా సేవ లు అందించినందుకు రూ.వంద కోట్లకు పైగా తీసుకునేవాడినని తెలిపారు. గురువారం బెలగంజ్​లో జరిగిన ఓ సభలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. బిహార్ ఉప ఎన్నికల్లో  ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీ జన్ సురాజ్ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. అయితే, ఆ పార్టీకి డబ్బుల్లేవని ఇతరులు విమర్శిస్తుండటంతో ఆయనకు కోపం వచ్చింది.

దీంతో ఓ సభలో ఆయన మాట్లాడారు. ‘‘వివిధ రాష్ట్రా ల్లో పది ప్రభుత్వాలు నా వ్యూహాలతో నడుస్తున్నాయి. ప్రచారం కోసం టెంట్లు ఏర్పాటు చేయడానికి నా దగ్గర తగినంత డబ్బు లేదని మీరు అనుకుంటున్నారా? బిహార్‌‌లో నా ఫీజు గురించి ఎవరూ వినలేదు. నేను ఎన్నికలలో ఎవరికైనా సలహాలు ఇస్తే రూ.100 కోట్ల కంటే ఎక్కు వగా తీసుకునేవాడిని.  ఒక్క పార్టీకి పని చేస్తే రెండేండ్ల పాటు నేను ప్రచారం చేసుకోవచ్చు”అని పేర్కొన్నారు.