విజయ్ మద్యం తాగుతూ, హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్నాడు.. అన్నామలై

విజయ్ మద్యం తాగుతూ, హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్నాడు.. అన్నామలై

తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్ తమిళనాడు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.  రాజకీయాలపై దృష్టిపెట్టకుండా తాగుతూ, హీరోయిన్ల నడుముపై చిటికెలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించారు. 

చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన అన్నామలై.. విజయ్ రాజకీయ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. నటుడు విజయ్ ఇంటినుంచే రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయాలపై దృష్టవిట్టకుండా సెట్స్ లో కూర్చొని సిగరెట్ తాగుతూ, మందు కొడుతూ, పాటలకు హిరోయిన్ల నడుమును తాకుతూ ఉన్నాడు.. నేను విజయ్ లా కాదు.. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని అన్నారు. 

Enna adi 🤣 pic.twitter.com/U3Bb8rPh2Q

— Trollywood 𝕏 (@TrollywoodX) March 17, 2025

అయితే మరోవైపు తమిళనాడు బీజేపీ తీరుపై టీవీకే నేతలు మండిపడుతున్నారు. తమిళనాడులో జరిగిన మద్యం కుంభకోణంపై బీజేపీ నిరసన వ్యక్తం చేయడం .. అంతా ఓ డ్రామా అని తమిళగ వెట్రి కజగం(టీవీకే) జనరల్ సెక్రటరీ ఆనంద్ తీవ్రంగా విమర్శించారు. 

ALSO READ | భద్రాచలాన్ని కేంద్రం విస్మరించింది: రాజ్య సభలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు